Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Sep-2017 15:53:51
facebook Twitter Googleplus
Photo

ఉంగరాల రాంబాబు కు ఎలాంటి టాక్ వచ్చిందో.. దాని వసూళ్లు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా తక్కువ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో తొలి రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్లోనూ చాలా తక్కువ ఆక్యుపెన్సీతో నడిచిందీ సినిమా. ఇక అమెరికాలో అయితే దీని పరిస్థితి మరీ దయనీయం.

అక్కడ ఏదో రిలీజ్ చేయాలని కొన్ని లొకేషన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తే.. కనీసం వెయ్యి డాలర్లు.. అంటే 64 వేల రూపాయలు కూడా ఈ చిత్రం వసూలు చేయలేదు. 700-800 డాలర్ల మధ్య వసూళ్లు వచ్చాయి. అంటే 50 వేలు మాత్రమేు వచ్చాయన్నమాట. రిలీజ్ ఖర్చులకు కూడా సరిపోని మొత్తమది. దీంతో పోలిస్తే నారా రోహిత్ ‘కథలో రాజకుమారి’ పరిస్థితి ఎంతో మెరుగు. పెద్ద ప్రచారం లేకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసినప్పటికీ.. ఇది 15 వేల డాలర్ల దాకా వసూలు చేసింది.

ఈ వీకెండ్లో ఐదు సినిమాలు రిలీజైనప్పటికీ.. అమెరికాలో విడుదల చేసింది ఈ రెండు చిత్రాల్నే. వీటితో పోలిస్తే మూడు వారాల కిందట వచ్చిన అర్జున్ రెడ్డి పరిస్థితే మెరుగు. నాలుగో వీకెండ్లోనూ ఈ సినిమా ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టి.. ఓవరాల్ గా 1.75 మిలియన్ డాలర్ల మార్కును దాటిందీ చిత్రం. ఐతే 2 మిలియన్ మార్కు అసాధ్యమని తేలిపోయింది.

,  ,  ,  ,  ,