Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 14:16:15
facebook Twitter Googleplus
Photo

అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాధం పూర్తి చేసేశాడు. ఈ నెల 23న డీజే థియేటర్లలోకి వచ్చేస్తున్నాడు. ఇక సెన్సార్ వర్క్.. ప్రమోషన్స్ మినహాయిస్తే ఈ చిత్రానికి పెండింగ్ ఏమీ లేదు. దీంతో బన్నీ తర్వాతి సినిమాపై జనాల ఫోకస్ ఇప్పటికే పెరిగిపోతోంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ తర్వాతి సినిమా ఉండనుందన్న విషయం ఇప్పటికే తేలిపోయింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్న తర్వాతి సినిమా కథపై బోలెడన్ని న్యూస్ చక్కర్లు కొట్టేస్తున్నాయి. నా పేరు సూర్య ఈ మూవీ టైటిల్ గా భావిస్తుండగా.. నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ కూడా పరిశీలనలో ఉంది. అయితే.. ఈ మూవీ కథ కోసం పలు జోనర్లను బాగా ఇంట్రెస్టింగ్ గా మిక్స్ చేశారన్నది గాసిప్ ల సారాంశం. ఎన్టీఆర్ బొబ్బిలి పులి నుంచి స్ఫూర్తి పొంది వక్కంతం ఈ మూవీ కథ రాసుకున్నాడని.. అలాగే దేశభక్తి నిండిన ఓ యువకుడు ఆర్మీలో చేరాలని భావిస్తాడని అంటున్నారు. అలాగే విపరీతమైన కోపం కారణంగా ఆర్మీలో చేరలేకపోతాడట.

ఈ కల్పిత కథ బాగానే ఉంది కానీ.. హీరోకు కోపం ఉండే పాత్ర అంటే ఆగ్రహంలో రాజశేఖర్ మాదిరిగా ఉంటుందట. అలాగే విపరీతమైన కోపం వచ్చినపుడు నాగార్జున రక్షకుడు టైపులో ఉంటుందట. కథేమో బొబ్బిలి పులి నుంచి స్ఫూర్తి పొందినది అని పుక్కిటి పురాణాలు బాగానే స్ప్రెడ్ అవుతున్నాయి. కోపిష్టి కేరక్టర్ అంటే.. ఆర్మీ వ్యక్తి.. అక్కడ ఇమడలేకపోవడం.. ఈ థీమ్ తో బన్నీ సరైనోడులో కూడా చేశాడు కదా. ఏమైనా ఇంకా షూటింగ్ మొదలుకాకముందే ఇన్నేసి కథలు పుట్టుకొచ్చేయడం అంటే.. బన్నీ మూవీకి ఉన్న క్రేజ్ అర్ధమవుతుంది

,  ,  ,  ,  ,  ,