Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 11:04:49
facebook Twitter Googleplus
Photo

ఇప్పటివరకు ఉన్న రూమర్లన్నీ అవాక్కయ్యేలే పంచ్ వేశాడు మెగా హీరో వరుణ్ తేజ్. కథలో సెకండాఫ్ సరిగ్గా రాకపోవడంతో శ్రీను వైట్ల సినిమాను డిలే చేస్తూ వచ్చిన ఈ హీరో.. ఇప్పుడు దర్శకుడు శ్రీను వైట్ల కథను సరిగ్గా సెట్చేసేసరికి వెంటనే ఓకె చెప్పేసినట్లున్నాడు. అందుకే రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని తనే స్వయంగా నిర్ణయించుకున్నాడు.

ఈ నెల 27 నుండి వరుణ్ తేజ్.. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి.. హెబ్బా పటేల్.. స్పెయిన్ దేశంలో షూటింగ్లో పాల్గొంటారట. ఇప్పటికే అందరికీ వీసాలు కూడా వచ్చేయడంతో.. మనోళ్ళు ఓ రెండు రోజుల ముందే అక్కడకు చేరుకోవడానికి సన్నద్దమవుతున్నారు. అయితే ఇలాంటి డేట్లు ప్రకటించడం వరుణ్-వైట్ల మూవీకి ఇదే తొలిసారి కాదు.. గతంలో స్పెయిన్ వెళుతున్నట్లు చాలా డేట్లు చెప్పారు. కాని అవన్నీ ప్రొడ్యూసర్లు ప్రకటించిన డేట్లు కాగా.. ఈసారి మాత్రం డేట్ ఇచ్చింది స్వయంగా వరుణ్ తేజే. మనోడు అఫీషియల్ గా ఈ విషయం డిక్లేర్ చేశాడు.

ఇకపోతే జూలై 18 నుండి శేఖర్ కమ్ముల సినిమాను కూడా మొదలెడుతున్నాడు. అంటే ఒకేసారి కుర్రాడు రెండు సినిమాల్లో మెరుస్తాడనమాట.

,  ,  ,  ,  ,  ,  ,