Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Apr-2016 12:18:16
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు.. ఇటు అభిమానులు, ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ పరిశ్రమ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. తాజాగా ఆయన హీరోగా నటించిన ?సర్దార్ గబ్బర్ సింగ్? సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించేందుకు మరో మూడు రోజుల్లో (ఏప్రిల్ 8న) పెద్ద ఎత్తున థియేటర్లలో వాలిపోనుంది. తెలుగులో ఈమధ్య కాలంలో ఏ సినిమాకూ లేనంత క్రేజ్ సంపాదించుకున్న సర్దార్ సినిమా టికెట్లకు క్రేజ్ అన్నిచోట్లా ఓ రేంజ్‌లో ఉంది.
ముఖ్యంగా ఓవర్సీస్‌లో సర్దార్ సినిమా టికెట్స్‌కు కనిపిస్తోన్న క్రేజ్ చూస్తే సినిమా మొదటి వారాంతం రికార్డులను బ్రేక్ చేసేదిగానే కనిపిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద సర్దార్ సినిమా టికెట్స్‌కి ఆన్‌లైన్లో విపరీతమైన రెస్పాన్స్ కనిపిస్తోంది. గురువారం అర్థరాత్రి నుంచే అమెరికాలో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీంతో ఈ ప్రీమియర్ షోస్‌కి టికెట్స్ సాధించడం ఓ క్రేజీ అంశంగా మారిపోయింది. పవర్ ఫేం బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ నిర్మించారు. పవన్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించారు

,  ,  ,  ,  ,