Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2015 14:19:55
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ హిట్ చిత్రం తని ఒరువన్ రీమేక్ లో సల్మాన్ఖాన్ - చరణ్ నటిస్తున్నారని ఇటీవలి కాలంలో వార్తలొచ్చాయి. బాలీవుడ్లో సల్మాన్ - టాలీవుడ్లో చరణ్ ఈ సినిమాని రీమేక్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని ప్రచారమైంది. సల్మాన్ - చరణ్ ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూలు చూశారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం కండల హీరో సల్మాన్ ఆల్మోస్ట్ ఫైనల్ అయినట్టేనని సోర్సెస్ చెబుతున్నాయి.

వారంలో ఈ సినిమాని ఫిక్స్ చేసేందుకు సల్మాన్ రెడీ అవుతున్నాడు. ప్రాజెక్టు ఆన్ సెట్స్ వెళ్లే ముందే సంతకాల ప్రక్రియ కోసం వేచి చేస్తున్నారు. ఈ విషయం తని ఒరువన్ దర్శకుడు మోహన్ రాజాకి అత్యంత సన్నిహితుల ద్వారా వెల్లడైంది. మోహన్రాజా స్వయం గా బాలీవుడ్ రీమేక్ కి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదే అతడికి ఉత్తరాదిన ఎంట్రీ సినిమా. అయితే ఈ సినిమాలో నటించేందుకు టాలీవుడ్ స్టార్ హీరో రామ్చరణ్ సైతం ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాడన్నది తెలిసిందే. మహేష్ కి సినిమా నచ్చినా రీమేక్లపై ఆసక్తి లేక పోటీ నుంచి తప్పుకున్నాడు. ఇక చరణ్ ఖాయమైనట్టే అని వార్తలు వినిపించాయి.

ఒకవేళ సల్మాన్ తో సెట్స్కి వెళితే మోహన్ రాజా బాలీవుడ్ లో డైరక్షన్ పగ్గాలు చేపడతాడట. అంటే మరి తెలుగులో రామ్ చరణ్ ను ఎవరు డైరక్టు చేస్తారు? లేదా టైమ్ తీసుకుని తీరిగ్గా బాలీవుడ్ సినిమా పూర్తి చేసి అటుపై తెలుగు లో రీమేక్ చేసేందుకు మోహన్రాజా వస్తాడా? అన్నది తేలాల్సి ఉంది. లేదూ ఈ సినిమాని వేరొక దర్శకుడి తో చేయించేందుకు చరణ్ ప్లాన్ చేస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉందింకా. వెయిట్ టిల్ దెన్!

,  ,  ,  ,