Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 10:58:05
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 కొత్త సెన్సేషన్ కి పునాది పడిపోయింది. ఇప్పటికే వరుసగా ఆడియో సాంగ్స్ విడుదల చేస్తూ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న మెగాస్టార్.. ఇప్పుడు ' మీ మీ మీ మీమీ.. ఇకపై ఓన్లీ యూ అండ్ మీ' అంటూ శ్రోతల దగ్గరకు వచ్చేశారు.

ఖైదీ నంబర్ 150లో ఇప్పటివరకూ రిలీజ్ చేసిన రెండు పాటలు ఫాస్ట్ బీట్ తో సాగేవి అయితే.. ఇది రొమాంటిక్ మెలోడీ. ట్యూన్ నార్మల్ గా ఉన్నట్లు అనిపిస్తున్నా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ లో సౌండింగ్ మాత్రం చాలా కొత్తగా ఉంది. మరోవైపు ఈ మెలోటీని హరిహరన్ తో పాడించడం బాగా అడ్వాంటేజ్ అయింది. సాయంకాలాన సాగరతీరాన అంటూ హరిహరన్ గొంతు వినగానే మ్యూజిక్ లవర్స్ కి మైకం వచ్చేయడం ఖాయం. ఇక ఫిమేల్ వెర్షన్ ని శ్రేయాఘోషల్ అందుకున్న తీరు అయితే మార్వలెస్ అనాల్సిందే.

చిరు-కాజల్ ల మధ్య వచ్చే ఈ రొమాంటింక్ సాంగ్ ను స్లొవేనియాలో చిత్రీకరించారు. లిరికల్ సాంగ్ లో యూజ్ చేసిన ఫోటోలు చూస్తే తన లుక్స్ తో మెగాస్టార్ మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. స్లో సాంగ్స్ కు చిరు వేసే అద్భుతమైన స్టెప్స్ కు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అందాలు తోడయ్యే సరికి పాటకు మరింతగా అందం వచ్చేసింది. మొత్తం మీద మూడో పాటతో కూడా మెస్మరైజ్ చేసేశాడు ఖైదీ.

,  ,  ,  ,  ,  ,