Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jan-2016 12:19:09
facebook Twitter Googleplus
Photo

'కర్తవ్యం' చిత్రంతో నిర్మాతగా కెరీర్‌ స్టార్ట్‌ చేసి తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలందరితోనూ సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎ.ఎం.రత్నం కి పితృ వియోగం జరిగింది. ఎ.ఎం.రత్నం తండ్రి అరని మునుస్వామి(96) నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెంలో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. పెద్దవాడైన ఎ.ఎం.రత్నం ప్రముఖ నిర్మాతగా, అతని సోదరుడు ఎ.దయాకర్‌ డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

,  ,  ,