Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 11:51:29
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ దర్శకుల్లో మారుతి ఇప్పుడో బ్రాండ్. ఆ బ్రాండ్ ని కూడా తనకు తానే డెవలప్ చేసుకున్న రికార్డ్ ఈ దర్శకుడిది. తనకు గుర్తింపు వచ్చిన తర్వాత.. పాత బ్రాండ్ ను చెరిపేసి కొత్తకొత్త ట్యాలెంట్స్ ను మారుతి చూపించేస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ తో బ్లాక్ బస్టర్ కొట్టేశాక.. ఈ దర్శకుడి రేంజ్ మారిపోయింది. రీసెంట్ గా బాబు బంగారం చిత్రంతోనూ మంచి వసూళ్లే సాధించినా.. ఫైనల్ రిజల్ట్ మాత్రం సంతృప్తిగా రాలేదు.

అక్కినేని హీరోతో ఓ ప్రాజెక్ట్ ని మారుతి ఇప్పటికే ఫైనల్ చేసేశాడని తెలుస్తోంది. ఈ సారి మారుతి డైరెక్ట్ చేసేది ఎవరినో కాదు.. అక్కినేని వారసుడు అఖిల్ తోనే. ఈ న్యూస్ ఇంతకు ముందే ఉన్నా.. విక్రమ్ కె. కుమార్ తో అఖిల్ రెండో సినిమా ఖాయం కావడంతో మారుతి తప్పుకున్నట్లే అనుకున్నారంతా. కానీ మనం డైరెక్టర్ అఖిల్ సెకండ్ ను తీస్తుండగా.. మారుతిన మూడో మూవీకి ఫైనల్ చేశారని తెలుస్తోంది. విక్రమ్ కె. కుమార్ కంటే ముందే నాగార్జున స్టోరీ లైన్ చెప్పాడు మారుతి.

నాగ్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఈ డైరెక్టర్.. ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ రాసుకోవడంలో బిజీగా ఉన్నాడు. అయితే.. అఖిల్- విక్రమ్ కె కుమార్ సినిమా పూర్తయ్యే లోపు.. హవీష్ హీరోగా మారుతి ఓ మూవీని డైరెక్ట్ చేయనుండగా.. మరోవైపు తన అసోసియేట్స్ ను దర్శకులుగా పరిచయం చేస్తూ.. తనే స్క్రిప్ట్ రాసి మరీ నిర్మాణం చేపట్టే ప్రాసెస్ ను కంటిన్యూ చేయనున్నాడట.

,  ,  ,  ,  ,  ,