Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2017 10:45:14
facebook Twitter Googleplus
Photo

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలే ఇండస్ట్రీలో ఉన్నారు. మెగాస్టార్ వారసులుగా పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్.. సాయిధరం తేజ్.. వరుణ్ తేజ్.. అల్లు శిరీష్.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అందరికీ ఎవరి స్టైల్ వారికి.. ఎవరి స్థాయి వారికి ఉంది కానీ.. అందరిలోకీ అల్లు అర్జున్ మాత్రం సంథింగ్ స్పెషల్ అయిపోతున్నాడు.

వరుసగా హిట్స్ కొట్టేస్తూ.. ఒకదాన్ని మించి మరొక సక్సెస్ సాధిస్తూ.. బన్నీ దూసుకుపోతున్న తీరు చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. చాలామంది నోటి వెంట.. నెక్ట్స్ మెగాస్టార్ ఈజ్ బన్నీ అనే మాట వినిపించడం కూడా పరిపాటి అయిపోయింది. ప్రస్తుతం డీజే ప్రమోషన్స్ లో ఉన్న బన్నీ కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి వచ్చింది. మెగా ఛెయిర్ కి అల్లు అర్జున్ దగ్గరవుతున్నాడా అనే ప్రశ్నకు.. బన్నీ చాలా వినయంగా సమాధానం ఇచ్చాడు. ఈ కాంప్లిమెంట్ కు థ్యాంక్యూ. ఇంకో మెగాస్టార్ ఉండే అవకాశం లేదు. చిరంజీవిగారి స్థాయికి సబ్ స్టిట్యూట్ అనేది ఉండదు. నేను ఏదైనా చేయాలన్నా కూడా.. ఆయన చెప్పిన డైలాగ్ నో.. చిన్న స్టెప్ వేయడం తప్ప.. ఆయన్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు అన్నాడు అల్లు అర్జున్.

ఆయన ఓ ఒరిజినల్ పర్సనాలిటీ.. ఆయన్ను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఆయనంటే అపారమైన గౌరవం.. ఇష్టం ఉన్నాయి. అయినా సరే.. నాకు ఒరిజినల్ గా ఉండడమే నాకిష్టం. ఎవరి ఒరిజినాలిటీ వాళ్లకు ఉండాలి. అందుకే చిరంజీవి గారిని ఇమిటేట్ చేసే ప్రయత్నం నేను చేయలేదు అంటూ సమాధానమిచ్చాడు బన్నీ.

,  ,  ,  ,