Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:41:46
facebook Twitter Googleplus
Photo

సినిమా రంగంలో ఓ స్పెషాలిటీ ఉంటుంది. హీరోలు తమ కొడుకులను సినిమాల్లోకి తీసుకొస్తూ ఉంటారు కానీ.. హీరోయిన్ల వారసులు రావడం చాలా చాలా తక్కువ. వచ్చిన నిలబడ్డ దాఖలాలు కనిపించవు. తమ పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా ఉంచేందుకే చాలామంది హీరోయిన్లు ట్రై చేస్తుంటారు. కానీ స్వీటీ అనుష్క మాత్రం తన పిల్లలు కోరుకుంటే కచ్చితంగా సినిమాల్లోకి తీసుకొస్తానంటోంది.

'మొదట్లో నాకు సినిమా రంగం నుంచి పారిపోదామని అనిపించేది. చాలాసార్లు ఏడ్చేసే దాన్ని. ఇందుకు కారణం ఇక్కడి పరిస్థితులు ఎంత మాత్రం కాదు. నాకే ఇక్కడ ఏమీ అర్థమయ్యేది కాదు. కొంచెం కొంచెం చొప్పున నేర్చుకోవడం మొదలుపెట్టాక సేఫ్టీ ఎక్కువగా ఉండే రంగాల్లో సినిమా ఒకటి అనే విషయం తెలిసింది. నేను ఎప్పుడూ ఇక్కడ ఇబ్బంది పడదలేదు. నన్నెవరూ ఇబ్బంది పెట్టలేదు. మంచి చెడులు మన నిర్ణయాలపైనే ఉంటాయి. ఫ్యూచర్ లో నాకు పుట్టబోయే పిల్లలు సినిమాలపై ఆసక్తి ఉందన్నా సరే.. ఏమాత్రం ఆలోచించకుండా ఇక్కడికి తీసుకొచ్చేస్తా' అని చెబుతోంది స్వీటీ అనుష్క.

అనుష్కకి పిల్లలు అంటే.. ఎప్పుడు పెళ్లయింది లాంటి డౌట్స్ అవసరం లేదు. ఇంకా అమ్మడికి పెళ్లి కాలేదు కానీ.. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సంగతి ముందే చెప్పేస్తోందంతే. ఈ కబుర్లు వింటుంటే స్వీటీకి సినిమాల కంటే పెళ్లిపై మనసు పెరుగుతోందని అనిపించడం లేదూ!

,  ,  ,  ,  ,  ,