Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2016 13:40:12
facebook Twitter Googleplus
Photo

బొమ్మరిల్లు సినిమాతో ఓ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు భాస్కర్. ఈ సినిమా తర్వాత ఆయన పేరు బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపొయిందంటే అర్ధం చేసుకోవొచ్చు ఆ సినిమా ప్రభావం ఏమిటో. అయితే ఆ సినిమా తర్వాత మరో హిట్ ఇవ్వలేకపోయాడు. అరేంజ్ సినిమా అయితే ఓ రేంజు లో ముంచేసింది. ?ఒంగోలుగిత్త? కూడా అంతే. ఇలా రెండు ఫ్లాపులు ఇవ్వడంతో ఆయనకి బ్రేక్ పడిపోయింది.

అయితే ఇన్నాళ్ళకు మళ్ళీ వస్తున్నాడు భాస్కర్. గీతా ఆర్ట్స్ సంస్థలో ఓ సినిమా చేయబోతున్నాడని తెలిసింది. ఇది అల్లు శిరీష్ కోసమని టాక్. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇది పూర్తయిన వెంటనే సినిమాపై ఓ ప్రకటన వచ్చే అవకాశం వుంది.

,  ,  ,  ,  ,