Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2016 12:55:52
facebook Twitter Googleplus
Photo

ఇదిగో షూటింగ్ అయిపోయింది అంటారు.. అదిగో రిలీజ్ డేట్ అంటారు.. ఆడియో కూడా రెడీ అని చెబుతారు.. కానీ అంతలోనే డేట్లు మారిపోతుంటాయి. ?బ్రహ్మోత్సవం? గురించి ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కొన్ని నెలలుగా. ముందు ఏప్రిల్ 24న తిరుపతిలో ఆడియో వేడుక అన్నారు. మే 6న సినిమా విడుదల అని చెప్పారు. కానీ మళ్లీ డేట్లు మారిపోయాయి. ఆడియో డేట్ మే 1కి మారింది. సినిమా విడుదల మే 13న అన్నారు. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త డేట్లు వినిపిస్తున్నాయి. ఆడియో విడుదల వాయిదా పడిందన్నది తాజా సమాచారం. అంతే కాదు.. ముందుగా అనుకున్నట్లు తిరుపతిలో ఆడియో వేడుక చేయాలన్న ఆలోచన కూడా పక్కనబెట్టేశారట.

కారణాలేంటో తెలియదు కానీ.. ?బ్రహ్మోత్సవం? ఆడియో వేదికను హైదరాబాద్ కు మార్చేశారట. రెగ్యులర్ గా ఆడియో వేడుకలు జరిగే శిల్ప కళా వేదికలోనే ఈ కార్యక్రమం జరుగుతుందట. మే 7న ఆడియో విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. సినిమా మే 20న కానీ.. లేదా 27న కానీ విడుదలవుతుందట. ఏప్రిల్ 10వ తారీఖునే ?బ్రహ్మోత్సవం? టాకీ పార్ట్ పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. మరి పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో ఇంత ఆలస్యం ఎందుకవుతోందా అర్థం కావడం లేదు. ప్రస్తుతం ?బ్రహ్మోత్సవం? టీమ్ పాటల చిత్రీకరణ ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్ నిర్మిస్తోంది. మహేష్ సరసన సమంత.. కాజల్.. ప్రణీత నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

,  ,  ,  ,  ,  ,  ,