Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jan-2016 15:36:44
facebook Twitter Googleplus
Photo

కేథరిన్ త్రెసా.. ఈ భామ కన్నడ ఇండస్ట్రీతో కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుని బాగానే వెలిగింది. ఇక్కడ అల్లు అర్జున్ సరసన ఛాన్స్ సంపాదించి గట్టి ప్రయత్నమే చేసినా అంతగా లక్కు మాత్రం కలిసి రాలేదు. దీంతో ఇక్కడి నుంచి చెన్నై షిఫ్ట్ అయిపోయి అక్కడ అదృష్టం వెతుక్కోవడం మొదలు పెట్టింది. మధ్యలో మళయాళం కూడా ట్రయల్స్ వేసింది లెండి.

కోలీవుడ్ స్టార్ కార్తితో చేసిన మద్రాస్ హిట్ కావడంతో.. అక్కడ వరుసగా మంచి ఆఫర్స్ నే పట్టేసింది కేథరిన్ త్రెసా. రీసెంట్ గా విశాల్ తో చేసిన కథాకళి కూడా హిట్ కావడంతో.. అమ్మడి స్పీడ్ మరింతగా పెరిగింది. కనితాన్ - వీర ధీర శూరన్ అంటూ.. రెండు తమిళ సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. వీటితోపాటు గౌతమ్ కార్తీక్ హీరోగా రాజదురై తెరకెక్కించనున్న మరో సినిమా కోసం కూడా కేథరిన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. ముత్తు రామలింగం అనే పేరుతో రూపొందునున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం సమకూర్చనున్నారు.

కోలీవుడ్ కేథరిన్ క్రేజ్ చూస్తుంటే.. నిదానంగా అయినా తమిళంలో బిజీ హీరోయిన్ అయిపోతోంది. చేతిలో ఉన్న సినిమాల్లో ఇంకొక్కటి హిట్ అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నట్లే అంటున్నారు కోలీవుడ్ జనాలు. అలాగని భారీ రెమ్యూనరేషన్స్ ముట్టచెప్పే తెలుగోళ్లను మాత్రం వదిలిపెట్టలేదు. ఇక్కడ అల్లు అర్జున్ సరసన సరైనోడులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఏకంగా అమ్మడి కేరక్టర్ ఎమ్మెల్యే రోల్ కావడం విశేషం.

,  ,  ,  ,