Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 12:04:51
facebook Twitter Googleplus
Photo

దువ్వాడ జగన్నాధం సక్సెస్ ను పంచుకోవడానికి.. డీజే టీం అంతా యూఎస్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఈ వీకెండ్ అంతా అమెరికాలోని పలు ప్రాంతాలలో చక్కర్లు కొట్టనున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ రాకకోసం అనేక ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. వీటిలో భాగంగా వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలను కవర్ చేయడం కోసం.. స్టైలిష్ స్టార్ అండ్ టీం కోసం ఒక ఛార్టర్డ్ ఫ్లైట్ ను కూడా బుక్ చేశారు.

సినిమా కోసం.. అందులోను ప్రత్యేకించి యూఎస్ మార్కెట్ కోసం టూర్ కాబట్టి.. ఈ ప్రయాణ ఖర్చులన్నీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ల చేతుల నుంచే పెట్టాల్సి ఉంటుందనే విషయం ఎవరికైనా అర్ధమవుతుంది. బన్నీ టూర్ కారణంగా వీరికి భారీ మొత్తమే వెచ్చించాల్సి వస్తోందట. కేవలం ఛార్టర్ట్ ఫ్లైట్ కోసమే 25వేల డాలర్లను ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ లో బన్నీతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే.. దర్శకుడు హరీశ్ శంకర్.. నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొంటున్నారు. అయితే.. స్టైలిష్ స్టార్ రాక కారణంగా.. వసూళ్ల స్థాయి మరికొంతమేర పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

గతంలో ధృవ టైమ్ లో కూడా రామ్ చరణ్ కోసం ఇలాగే భారీ మొత్తాన్ని ఖర్చు చేశారు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఏ హీరోతో అయినా ఇలాంటి టూర్స్ తమ లాభాలకు కోత పెడతాయని తెలిసినా.. ఆ తర్వాత వసూళ్ల స్థాయి పెరిగే అవకాశాలు ఉండడంతో.. వీటిని కవర్ చేసుకోవడం సాధ్యమవుతుందట. అందుకే ఇలాంటి టూర్స్ ను డిస్ట్రిబ్యూటర్స్ స్పాన్సర్ చేస్తూ ఉంటారట.

,  ,  ,  ,