Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 10:05:34
facebook Twitter Googleplus
Photo

అన్న సూర్య లాగే తమిళంతో సమానంగా తెలుగులో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తి. కానీ ఆవారా.. నా పేరు శివ లాంటి సినిమాలు ఇచ్చిన ఊపును ఆ తర్వాత కొనసాగించలేక వెనుకబడిపోయాడు. ఐతే గత ఏడాది ఊపిరి సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న కార్తి.. కాష్మోరా.. చెలియా సినిమాలతో నిరాశ పరిచాడు. ఇప్పుడతను ఖాకి సినిమాతో రాబోతున్నాడు. ఈ చిత్రం మళ్లీ తనకు తెలుగులో మంచి మార్కెట్ తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు కార్తి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ జోడీగా నటిస్తుండటం ఈ చిత్రాన్ని తెలుగులో ఓ మోస్తరు స్థాయిలో రిలీజ్ చేయడానికి కలిసొచ్చే అంశమే.

టైటిల్ చూస్తేనే చెప్పేయొచ్చు.. ఇది పోలీస్ కథ అని. ఇంతకుముందు సూపర్ హిట్ మూవీ శతురంగ వేట్టై తీసిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మధ్యే ఫస్ట్ లుక్ తో పలకరించిన కార్తి.. ఈ సినిమాకు సంబంధించిన మూడు ముఖ్యమైన తేదీల్ని ప్రకటించాడు. టీజర్.. ట్రైలర్ లాంచ్ డేట్లతో పాటు విడుదల తేదీని కూడా అతను వెల్లడించాడు. ఖాకి టీజర్ సెప్టెంబరు 27న.. ట్రైలర్ నవంబరు 17న.. సినిమాను నవంబరు 17న విడుదల చేయబోతున్నట్లు చెప్పాడు కార్తి. ఆడియో రంగంలో పేరు మోసిన ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేష్ గుప్తా.. సుభాష్ గుప్తా ఈ సినిమాతో నిర్మాతలుగా మారుతుండటం విశేషం.

,  ,  ,  ,  ,