Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jul-2017 10:49:24
facebook Twitter Googleplus
Photo

ఇటీవల కామెడీ మిక్సింగ్ ఎంటర్ టెయినర్లే ఎక్కువగా చేస్తున్న నాని ఈసారి మాంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ చేశానని చెప్పుకొచ్చాడు. జెంటిల్ మెన్ సినిమా తర్వాత నివేదా థామస్ మరోసారి నానికి జోడీగా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఓ స్పెషల్ రోల్ చేశాడు.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నిర్మాత కోన వెంకట్ ఓ ఇంట్రస్టింగ్ విషయం రిలీల్ చేశాడు. ఈ సినిమాలో నివేదా ప్లేస్ లో ఓ టాప్ హీరోయిన్ ను తీసుకుందామని భావించారు. కోన ఫ్యామిలీకి ఆమె క్లోజే అయినప్పటికీ ఈ సినిమా చేయడానికి ఇష్టపడలేదు. వరస హిట్లతో దూసుకుపోతున్న నాని పక్కన ఛాన్స్ చేయడానికి ఎవరైనా ఎగిరి గంతేస్తారు. నిన్ను కోరి స్ర్కిప్ట్ బాలీవుడ్ హీరోయిన్లకు సైతం వినిపించామని... అందరూ హీరోయిన్ రోల్ తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసల జల్లు కురిపించారని.. కానీ ఆ హీరోయిన్ మాత్రం నిష్కర్షగా నో చెప్పేసిందని కోన చెప్పారు. దీంతో నాని సిఫార్సు మేరకు ఈ పాత్రకు నివేదాను తీసుకున్నామన్నారు.

నిన్ను కోరి సినిమాను సదరు టాప్ హీరోయిన్ మూడు కారణాలతో రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఒకటి కోన మిగతా నిర్మాతల స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వడు. రెండోది నాని ఈజ్ ముందు తెరపై మిగతా క్యారెక్టర్లు ఏవీ హైలైట్ అయ్యే అవకాశమే ఉండదు. అయితే మన సినిమాల్లో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ షోలకే పరిమితం. నటనాపరంగా పేరు తెచ్చిపెట్టే పాత్రలొచ్చినప్పుడు మిగతా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతుంటారు.

,  ,  ,  ,  ,