Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jun-2016 12:39:48
facebook Twitter Googleplus
Photo

అదిగో మొన్ననే ఫిబ్రవరి నెలలో ఒక సినిమా రిలీజైంది. షార్టు బ్రేక్ తీసుకుని వెంటనే కొత్త సినిమా మొదలెట్టేశాడు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ డేట్ వచ్చిందో లేదో.. అప్పుడే మరో సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఇంతకీ ఇలా ఖాళీ లేకుండా కష్టపడుతున్న హీరో ఎవరో తెలిసిందిగా.. ఇంకెవరు మన గంటా నవీన్ బాబే.

అవునండి.. మన హీరో నాని ఉన్నాడు చూడండి.. ఫిబ్రవరిలో ''కృష్ణగాడి వీర ప్రేమగాధ'' సినిమాతో వచ్చాడు. ఆ సినిమా రిలీజై రిజల్టు వచ్చేలోపే ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్షన్ లో ''జెంటిల్మన్'' సినిమా షూటింగ్ మొదలెట్టేశాడు. ఇక జూన్ 17న ఈ కొత్త సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్న వేళ.. జూలై ఒక్క నెల బ్రేక్ తీసుకొని ఆగస్టు నుండి మరో సినిమా మొదలెట్టాలని డిసైడ్ అవుతున్నాడు మన హీరో. సినిమా చూపిస్తా మావా దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరక్షన్ లో మూవీని మొదలెడుతున్నాడు. ఆ సినిమా కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ అయిపోతే.. ఏకంగా ఒకే ఏడాదిలో మనోడు 3 సినిమాలను దించేస్తున్నట్లు.

ఒక ప్రక్కన పెద్ద హీరోలు మాత్రం.. సినిమా సినిమాకూ మధ్యన ఫారిన్ టూర్లు ఫ్యామిలీ లీజర్లు అంటూ భారీగా బ్రేకులు తీసుకుంటుంటే.. నాని మాత్రం బండిని యమా స్పీడుగా పరిగెత్తించేస్తున్నాడే. ఖాళీ లేకుండా కష్టపడుతున్నాడనుకోండి.

,  ,  ,  ,  ,  ,  ,