Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Aug-2015 16:46:31
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో టాలీవుడ్ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నోరా ఫతేహి. మొరాకో నుంచి వచ్చి ఇక్కడ సెటిలైంది ఈ భామ. కెనడాలో మోడలింగ్ చేసి అట్నుంచి బాలీవుడ్ టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక్కడ ఫేమస్ ఐటెమ్ గాళ్ గా ఎదిగేసింది. ప్రస్తుతం ఈ లేడీ ఐటెమ్ టాలీవుడ్ లో హాట్ ప్రాపర్టీ.

ప్రారంభం .. పూరి జగన్నాథ్ ఈ భామని తెలుగుతెరకి పరిచయం చేశాడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ చిత్రంలో ఐటెమ్ నంబర్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి కిక్ 2 షేర్ చిత్రాల్లో ఐటెమ్ నంబర్లలో నర్తించింది.

లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఈ అమ్మడు పూరీతో మరోసారి పనిచేస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా అతడు తరకెక్కిస్తున్న లోఫర్ చిత్రంలో హాట్ ఐటెమ్ నంబర్ లో చిందేయబోతోంది అమ్మడు. నోరా మరోసారి వెండితెరపై మెరుపులు మెరిపించబోతోంది. పూరీ పరిచయం చేసిన ఐటెమ్ భామల్లో ముమైత్ ఖాన్ తర్వాత మళ్లీ అంత పాపులారిటీ ఈ అమ్మడికే దక్కిందన్నమాట!

,  ,  ,  ,