Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-May-2016 12:15:56
facebook Twitter Googleplus
Photo

సైన్స్ ఫిక్షన్ సినిమాలకు సాధారణంగా సీక్వెల్స్ తీయడానికి అవకాశాలు ఎక్కువ. తెలుగులో వచ్చిన బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ?ఆదిత్య 369? సీక్వెల్ కోసం స్టోరీ బోర్డుతో సహా స్క్రిప్టు రెడీగా ఉంది కానీ.. అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇక హిందీలో ?కోయీ మిల్ గయా?కు రెండు సీక్వెల్స్ వచ్చాయి. ప్రస్తుతం తమిళ-తెలుగు భాషల్లో మంచి క్రేజ్ మధ్య రిలీజవ్వబోతున్న ?24?కు కూడా సీక్వెల్ తీయడానికి ఆల్రెడీ స్కెచ్ గీసేశాడు దర్శకుడు విక్రమ్ కుమార్. సీక్వెల్ కోసం అతను ఆల్రెడీ లైన్ కూడా రెడీ చేసేశాడట. ఐతే ?24?కు వచ్చే ఫలితాన్ని బట్టి.. తనతో పాటు సూర్య ఫ్యూచర్ ప్రాజెక్టుల్ని బట్టి అతను సీక్వెల్ తెరకెక్కించడంపై నిర్ణయం తీసుకుంటాడట.

?24?కు పాజిటివ్ రిజల్ట్ వస్తే.. దీని తర్వాత ఓ సినిమా చేసి సీక్వెల్ మీద దృష్టిపెడతాడట. లేదంటే సీక్వెల్ ఆలోచన మానుకుంటాడట. మరోవైపు ?24? అంచనాలకు తగ్గట్లుగా ఆడితే ఇది బాలీవుడ్లో రీమేకయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయట. దీని టీజర్.. ట్రైలర్ చూసి బాలీవుడ్ హీరోలు అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. హృతిక్ రోషన్ రీమేక్ మీద ఆసక్తి చూపిస్తున్నారట. సినిమా రిజల్ట్ చూసి వీరిలో ఎవరో ఒకరు రీమేక్ లో నటించే అవకాశాలున్నాయట. బహుశా ఆ సినిమాకు విక్రమే దర్శకత్వం వహించాల్సి రావచ్చు. ఐతే విక్రమ్ కు అల్లు అర్జున్.. మహేష్ బాబులతో కమిట్మెంట్లు ఉన్నాయి. మరి ?24? హిట్టయితే.. దాన్ని బాలీవుడ్లో రీమేకే చేస్తాడా.. సీక్వెలే చేస్తాడా.. లేక మహేష్ బాబు.. బన్నీలతో అనుకున్న సినిమాలే చేస్తాడా.. ఏం జరుగుతుందో చూడాలి.

,  ,  ,  ,  ,  ,