Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Dec-2014 10:36:46
facebook Twitter Googleplus
Photo

అనూప్ రూబెన్స్ ఇప్పుడు క్లౌడ్ నైన్ మీద విహరిస్తున్నాడు. కారణం, వరుస విజయాలు తన ఖాతాలో జమ అవుతున్నందుకు కాదు. పవన్ కల్యాణ్ ఈ సంగీత దర్శకుడికి ఫోన్ చేశాడట. అంతేకాదు, 'ఐ లవ్ యూ' అంటూ ప్రేమ కూడా కురిపించాడు. దీని గురించి అనూప్ చెబుతూ, "ఈ రోజు నాకు నిజంగానే మంచి రోజు. ఇప్పుడే పవన్ కల్యాణ్ సార్ ఫోన్ చేశారు. 'ఐ లవ్ యూ అనూప్' అంటూ అభినందించారు. తర్వాత ఇంకా చెబుతూ 'మనం త్వరలోనే మళ్లీ వర్క్ చేస్తున్నాం' అన్నారు. ఇంతకు మించిన ఆనందం ఏముంది" అంటూ ట్వీట్ చేశాడు. దీనిని బట్టి పవన్ తన తదుపరి సినిమాకి అనూప్ ని సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నాడని అనుకోవచ్చు. 'గోపాల గోపాల' సినిమాకు అనూప్ ఇచ్చిన మ్యూజిక్ పవన్ కి బాగా నచ్చిందట!

,  ,  ,  ,  ,  ,