Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 16:04:18
facebook Twitter Googleplus
Photo

చెన్నై: తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించినప్పటికీ మంచి గుర్తింపు రాలేదు నటి రాధిక ఆప్టేకి. కానీ రజనీకాంత్‌తో ?కబాలి?లో జోడీ కడుతోందన్న మాటతో ప్రత్యేక గుర్తింపు సాధించింది. అందుకే ఆ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది రాధిక. సోమవారం సెన్సార్‌ పూర్తిచేసుకుని ?యు? సర్టిఫికెట్‌ అందుకోగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 22వ తేదీన విడుదల కానుంది. దాదాపు 10 వేల థియేటర్లలో విడుదల అవుతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, జాపనీస్‌, ఆంగ్లం, చైనీస్‌ తదితర భాషల్లో ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌తో కలసి నటించిన అనుభవాలను రాధికా ఇలా వివరించారు.
ప్ర: ?కబాలి? అవకాశం ఎలా వచ్చింది?
జ: ఓ సారి దర్శకుడు రంజిత్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. రజనీకాంత్‌ నటిస్తున్న ?కబాలి? సినిమా గురించి మాట్లాడాలని అన్నారు. కానీ నేనేదో కామెడీకి అడుగుతున్నారని అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత చెన్నైకి రావాలని విమాన టికెట్‌ కూడా పంపించారు. చాలా ఆశ్చర్యపోయా. అయినప్పటికీ ఖరారు చేసుకోలేదు. చెన్నైకి వచ్చిన నాకు ?కబాలి? కథ గురించి చెప్పారు. వెంటనే బాగా నచ్చింది. అందులోనూ రజనీకాంత్‌తో నటించే అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? తప్పకుండా నటిస్తానని చెప్పా. ఇదంతా వారం రోజుల్లోనే పూర్తయింది.
ప్ర: ?కబాలి?లో మీ పాత్ర గురించి?
జ: ఇదివరకు నేను నటించిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. కథలో కీలకమైనది. అయినప్పటికీ వాటి గురించి ప్రస్తుతం పూర్తిగా చెప్పలేను. ?ఇందులో మీది ముఖ్యమైన పాత్ర, నటనకు ఎక్కువ అవకాశం ఉంది. నీ ప్రతిభను చాటుకునేలా ఉంటుంద?ని చెప్పారు. నటించేటప్పుడే అది స్పష్టమైంది. ఇలాంటి అవకాశం రావడం అదృష్టమే. ఇది రజనీకాంత్‌ సినిమా అయినప్పటికీ.. నా పాత్రే కీలకంగా ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
ప్ర: తెలుగు, మలయాళం, తమిళం, హిందీ.. ఇలా పలు భాషల్లో నటించారు. వీటిలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించారా?
జ: వాస్తవంగా చెప్పాలంటే నటించే విషయంలో పెద్ద మార్పు, వ్యత్యాసం కనిపించలేదు. కానీ ఒక్కో భాష సినిమాకు ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అదొక్కటే తేడా. బాలీవుడ్‌లో వరుసగా రెండు సినిమాల్లో నటిస్తే అక్కడుకున్న నటుడు, దర్శకుల్లో చాలా మార్పులొస్తాయి. తదుపరి శైలి కాస్త మారుస్తారు.
ప్ర: ?కబాలి? చిత్రం ఎలా ఉంటుంది?
జ: అనుకున్నదాని కన్నా దిబెస్ట్‌గా ఉంది. నేనింకా సినిమాను చూడలేదు. కానీ అద్భుతంగా ఉన్నట్లు చాలా మంది చెప్పారు. రజనీకాంత్‌తో నటించడం నా జీవితంలోనే చాలా కీలకంగా భావిస్తున్నా. ఈ సినిమాను చూసిన తర్వాత నా నటన బాగుందని ఎవరైనా చెబితే అది నా ప్రత్యేకతగానే లెక్కిస్తా.
ప్ర: షూటింగ్‌ సమయంలో చోటుచేసుకున్న ఆసక్తికరమైన విషయాలు?
జ: రజనీకాంత్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారని తెలుసు. కానీ ఎంతలా ఉంటారోనన్న విషయాన్ని తెలుసుకున్నా. ఓ సారి ఆసుపత్రిలో చిత్రీకరణ జరిపాం. అక్కడ వేలాది మంది అభిమానులు గుమిగూడారు. దీంతో ఆ రోజు చిత్రీకరణకు ఆటంకం కలిగింది. అంతస్థాయిలో అభిమానులు వచ్చారు. అప్పుడే ఆయన అభిమానుల ప్రత్యేకత గురించి తెలిసింది.
ప్ర: రజనీకాంత్‌తో నటించిన అనుభవం గురించి?
జ: రజనీతో నటించడాన్ని నా జీవితంలోనే మరిచిపోలేను. ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా భావిస్తూ ప్రతి సన్నివేశంలోనూ నటించా. నేను చూసిన నటుల్లో.. వృత్తిపట్ల రజనీకాంత్‌లా అంకితభావం ఉన్న వ్యక్తులను చూడలేదు. సెట్‌లో ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తారు. ఆయన నడక, ఆహార్యం, స్టెల్‌, తదుపరి షాట్‌కు తనను తాను మలచుకునే తీరు, వారి నిరాడంబరత, ఇతరులతో వ్యవహరించే విధానం, అందరికీ మర్యాదనిచ్చే శైలి.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు చెప్పుకుంటూ వెళ్లొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రజనీకాంత్‌ అద్భుతమైన వ్యక్తిత్వమున్న మనిషి. ఆయనలా ఇంకొకరు లేదు.
ప్ర: మీ తదుపరి సినిమాల గురించి?
జ: ప్రస్తుతం నేను నటించిన బాంబైరియా, భవేష్‌జోషి, ది అశ్రం, ది ఫీల్డ్‌, ఉలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

,  ,  ,  ,  ,  ,