Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 10:56:15
facebook Twitter Googleplus
Photo

రఘు కుంచె కెరీర్ లో బోలెడన్ని మలుపులు ఉంటాయి. కెరీర్ ఆరంభంలో టెలివిజన్ యాంకర్ గా చేసిన రఘు కుంచె.. ఆ తర్వాత సింగర్ గా అవతారం ఎత్తాడు. ఈ ప్రొఫెషన్ లో మంచి పొజిషన్ కి చేరుకున్నాక.. మ్యూజిక్ డైరెక్టర్ గా మారడు. అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయినా.. విదేశాల్లో ప్రోగ్రామ్స్ కి ఆర్కెస్ట్రాలతో బాగా బిజీగానే ఉంటున్నాడు.

సంగీత దర్శకుడిగా కెరీర్ కి సపోర్ట్ ఇవ్వలేకపోయిన రఘుకుంచె ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇప్పటికే ఈయన ప్రొడక్షన్ లో ఓ సినిమా షూటింగ్ కూడా జరుపుకుంటోంది. జ్యోతి లక్ష్మి మూవీలో లీడ్ కేరక్టర్ చేసిన సత్య దేవ్ హీరోగా.. ఓ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా 'రైట్ రైట్ ' లో కనిపించిన పూజా ఝవేరి నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది.

కంపోజర్ గా ఫెయిల్ అయినా.. అదే ప్రొఫెషన్ ని మరో యాంగిల్ లో కంటిన్యూ చేస్తూ బిజీగా ఉన్న రఘు కుంచెకి ఈ ప్రొడ్యూసర్ అవతారం ఏ మేరకు సక్సెస్ ను ఇస్తుందో చూడాలి. అయితే.. ఇండస్ట్రీలో కష్టపడి రేంజ్ ని సంపాదించుకుని.. నిలబెట్టుకున్నవాళ్లలో మాత్రం రఘు కుంచె పేరు ఎప్పటికీ ఉంటుందిలే

,  ,  ,  ,  ,