Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2016 13:21:17
facebook Twitter Googleplus
Photo

ఎవరి గెలుపుకైనా మూలం... కలే అవుతుంది. దాన్ని సాకారం చేసుకోవడమా, లేదంటే కలల ప్రపంచంలో బతికేయడమా అనేది వారి నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది?? అంటోంది సమంత. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సమంత, చిత్రసీమలో ఎలాంటి అండ లేకపోయినా స్టార్‌ కథానాయిక అయిపోయింది. తన ప్రయాణం, తన జీవితం తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందంటోంది సమంత. ??గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. కొన్ని ఎదురు దెబ్బలు తినొచ్చు. కొన్ని బంధాలు తెగిపోవొచ్చు. కొంతమంది మిమ్మల్ని ద్వేషించొచ్చు. కొన్ని రోజులు నిద్రకు కూడా దూరమవ్వొచ్చు. వీటన్నింటికీ సిద్ధపడి ప్రయాణం చేయండి. కచ్చితంగా ఏదో ఒక రోజు గెలుపు మిమ్మల్ని వరిస్తుంది. గెలిచిన తరవాత... మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ మిమ్మల్ని వెదుక్కొంటూ వస్తాయి. దానికి నేనే పెద్ద ఉదాహరణ?? అని చెబుతోంది. ప్రస్తుతం ?జనతా గ్యారేజ్‌?లో నటిస్తున్న సమంత, ?యూ టర్న్‌? అనే తమిళ చిత్రాన్ని ఒప్పుకొంది.

,  ,  ,  ,  ,  ,