Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jul-2017 12:00:39
facebook Twitter Googleplus
Photo

టాప్ బ్యూటీగా కంటిన్యూ అవుతూనే.. అక్కినేని నాగచైతన్యతో పెళ్లికి సిద్ధమైపోయింది సమంత. మరో మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కేయనున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెగ బిజీగా ఉంటోంది. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంది. మరోవైపు బ్రాండ్ అండార్స్ మెంట్స్ విషయంలో కూడా బాగానే సంపాదించేస్తోంది. ఇక షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ సందడులు కూడా ఈ మధ్య బాగానే పెరిగాయి.

మరోవైపు సమంతకు స్వచ్ఛంద సేవపై కూడా మక్కువ ఎక్కువ. తన సంపాదనలో చాలా భాగాన్ని ఇందుకే కేటాయించేస్తుంటుంది. మొదట ప్రత్యూష ఫౌండేషన్ కు వెనక ఉండి సాయం చేసిన సమంత.. ఆ తర్వాత ముందుకొచ్చి మరీ నడిపించేస్తోంది. ఈ ఫౌండేషన్ ఇంత విజయవంతంగా నడవడానికి కారణం.. సమంత తన సంపాదన నుంచి చాలా మొత్తాన్ని కేటాయించేయడమే. సినిమాల్లో వచ్చే పారితోషికంలో కొంత భాగాన్ని ఇటు మళ్లించే శామ్.. మాల్స్ ఓపెనింగ్.. యాడ్స్ వంటి ఇతర మార్గాల ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్ని సమాజ సేవకే తరలించేస్తుంది. వాటి నుంచి తాను ఒక్క పైసా కూడా తీసుకోనని తెగేసి చెప్పేస్తోంది సమంత.

సినిమాలు.. యాడ్స్.. రిబ్బన్ కటింగ్స్.. సమాజ సేవ.. ఇన్నేసి చేసేందుకు ఈ బ్యూటీకి టైం ఎక్కడి నుంచి వస్తోందని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే.. ఈ విషయంలో సమంత దగ్గర గట్టి జవాబే ఉంది. సెల్ ఫోన్స్ లో ఛాటింగ్ చేయడానికి.. ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొట్టడానికి చాలానే సమయం కేటాయిస్తాం కదా.

,  ,  ,  ,  ,