Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 12:24:43
facebook Twitter Googleplus
Photo

కొత్త కోడలు సమంత అత్తారింట్లోకి అడుగు పెట్టబోతోంది. ఇదే టైంలో తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి కూడా రెడీ అయిపోతోంది. ఇంతవరకు గ్లామర్ ప్రధాన పాత్రలే ఎక్కువ చేసిన సమంత రాబోయే చిత్రం రాజుగారి గది-2లో ఆత్మగా కనిపించబోతోంది. ఈనెల 13న ఈ మూవీ థియేటర్లకు రానుంది. మలయాళ సినిమా ప్రేతమ్ ఆధారంగా డైరెక్టర్ ఓంకార్ రాజుగారిగది-2 మూవీ తీశారు. ఇందులో హీరో నాగార్జున మెంటలిస్టుగా కనిపించబోతున్నారు.

ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుంటంతో చిత్ర యూనిట్ ఓ సమంతను ఓ కొత్తలుక్ లో చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో సమంత తెల్లటి పంచె.. లాల్చీ - జరీకండువా వేసుకుని పల్లెటూరి పెద్దమనిషి గెటప్ లో కనిపించింది. ఇదే గెటప్ లో చేతిలో బెత్తం పట్టుకుని పిల్లలకు పాఠాలు కూడా చెబుతోంది. సమంత - రావు రమేశ్ పంచెకట్టులో ఉన్న ఫొటో ఒకటి గతంలోనే బయటకొచ్చింది. అయితే అది రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం-1985 మూవీలోదని అంతా అనుకున్నారు. రంగస్థలం పీరియాడికల్ మూవీ కావడం.. అదీ గ్రామీణ నేపథ్యంలో తీస్తున్న సినిమా కావడంతో అంతా అలాగే భావించారు. ఇప్పటి పోస్టర్ తో అది రాజుగారి గది-2లోని పాత్ర అనే క్లారిటీ వచ్చింది.

తాజా పోస్టర్ లో అందానికే అందం అనిపించేలా... చిరునవ్వులతో మురిపించేలా కనిపించే సమంత ఈ సినిమాలో ఆత్మ పాత్రలో కనిపిస్తోందంటే కాస్తంత బాధకలగక మానదు. సమంత ఈ సినిమాతో అందరినీ భయపెడుతుందని ఆమె మామ - హీరో నాగార్జున చెప్పారు.

,  ,  ,  ,  ,  ,