Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Mar-2017 16:12:11
facebook Twitter Googleplus
Photo

కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన చాలామంది ఆ తర్వాత హీరోలయ్యారు. గత ఏడాది సప్తగిరి కూడా ఈ జాబితాలో చేరాడు. అతడి తొలి సినిమా సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఓ మోస్తరు ఫలితాన్నే ఇచ్చింది. సినిమాకు టాక్ ఏమంత బాలేకున్నా.. కామెడీ కొంత వరకు వర్కవుట్ కావడం.. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ సినిమాపై పడి ఓపెనింగ్స్ బాగా రావడం.. పైగా బడ్జెట్ కూడా తక్కువే కావడంతో సినిమాను నమ్ముకున్న వాళ్లందరూ సేఫ్ అయిపోయారు. ఈ ఉత్సాహంలో సప్తగిరి హీరోగా తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ సినిమా పేరు రివాల్వర్ రాజు అని ప్రచారం జరుగుతోంది.

రివాల్వర్ రాణి పేరుతో హిందీలో ఒక సినిమా రావడం తెలిసిందే. కంగనా రనౌత్ కథానాయిక. తెలుగులో ఇప్పుడు సప్తగిరి ‘రివాల్వర్ రాజు’ అయిపోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఇటీవలే స్క్రిప్టు ఓకే అయిందట. మరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’లో తనను హీరోగా బాగానే ప్రొజెక్ట్ చేశాడని భావిస్తున్న అరుణ్ పవార్ కే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నాడా.. లేక సప్తగిరి మరో దర్శకుడితో పని చేస్తున్నాడా అన్నది చూడాలి. తనకు కాలం కలిసొచ్చినంత కాలం.. హీరోగా అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తూ కమెడియన్ గానూ కొనసాగాలని భావిస్తున్నాడు సప్తగిరి

,  ,  ,  ,  ,