Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-Apr-2016 13:43:33
facebook Twitter Googleplus
Photo

సర్దార్ గబ్బర్ సింగ్.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా, తెలుగు సినీ పరిశ్రమలో గత కొద్దికాలంగా భారీ అంచనాలను మూటగట్టుకొని వచ్చిన సినిమా. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మిక్స్‌డ్ టాక్‌నే తెచ్చుకున్నా మొదటిరోజు కలెక్షన్స్ విషయంలో దుమ్మురేపింది. ఇక ఆ తర్వాత మెల్లిగా కలెక్షన్స్ పరంగా సత్తా చూపలేకపోయిన ఈ సినిమా, అమెరికాలో నేడు 1 మిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది.
భారీ అంచనాల మధ్య, యూఎస్‍లో అత్యధిక స్క్రీన్ కౌంట్‍తో విడుదలైన ఈ సినిమా, 1 మిలియన్ సాధించడానికి నాలుగు రోజులు పట్టడం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం. కేవలం పవన్ ఫ్యాన్స్‌ను మాత్రమే మెప్పించే అంశాలతో తెరకెక్కడంతో సాధారణం ప్రేక్షకుల నుంచి సినిమాకు అనుకున్న స్థాయి రెస్పాన్స్ రావడం లేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శరత్ మరార్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,