Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2015 10:12:00
facebook Twitter Googleplus
Photo

ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపజేసి, అనిర్వచనీయమైన వినోదాన్ని అందించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రం మనలో చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఆ సినిమా ద్వారా వెండితెరపై చిరంజీవి, శ్రీదేవి చేసిన మేజిక్ ప్రేక్షకులను కట్టిపారేసింది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన 'ఎప్సీ పరశురాం' మాత్రం అలరించలేకపోయింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వీరి కలయికలో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి నటించే 150వ సినిమాలో కథానాయికగా శ్రీదేవిని ఎంపిక చేసినట్టు టాలీవుడ్ లో తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి శ్రీదేవితో చర్చలు జరుగుతున్నాయట. అయితే, ఈ సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కూడా ఉంటుందట!

,  ,  ,  ,  ,