ధనుష్ రైల్లో రావడమేంటి.. ఫ్లైట్ లేదా అని డౌటొస్తోందా..? ఇది మామూలు ?రైలు? కాదులెండి. సినిమా ?రైలు?. ధనుష్ కొత్త సినిమా పేరు ఇది. అతను ప్రభు సాల్మన్ దర్శకత్వంలో చేసిన ?తొడారి? అనే సినిమాను తెలుగులో ?రైలు? పేరుతో అనువదిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తుంది.
తెలుగులో మార్కెట్ సంపాదించుకోవడానికి చాలా కాలం ప్రయత్నించి.. చివరికి ?రఘువరన్ బీటెక్?తో కోరిక తీర్చుకున్న ధనుష్.. అప్పట్నుంచి తన పాత.. కొత్త సినిమాలన్నింటినీ తెలుగులోకి తెస్తున్నాడు. ఇందులో భాగంగానే ?తొడారి? కూడా తెలుగులోకి వచ్చేస్తోంది. ధనుష్ ఈ సినిమాను పూర్తి చేసి చాలా కాలమైంది. కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమవుతూ వచ్చింది.
ఇది ఒక రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే ప్రేమకథ. కొంచెం థ్రిల్లర్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆల్రెడీ తమిళంలో విడుదలైన ట్రైలర్ బాగానే ఆసక్తి రేకెత్తించింది. ప్రేమఖైదీ.. గజరాజు.. తాజాగా ?తొలి ప్రేమలో? లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న ప్రభు సాల్మాన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆదిరెడ్డి.. ఆదిత్యరెడ్డి అనే కొత్త నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగులోకి తెస్తున్నారు. ఆడియోను ఈనెల 3న విడుదల చేయబోతున్నారు.