Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 14:21:04
facebook Twitter Googleplus
Photo

గ్లామర్ రోల్స్ కి చెక్ పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టిన స్టార్ హీరోయిన్ త్రిష రీసెంట్ గా ఒక క్రేజీ ఛాన్స్ దక్కించుకుంది. దర్శకుడు హరి తన హిట్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ విక్రమ్ తో సామి చిత్రానికి సీక్వెల్ గా సామి 2 ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ ప్రాజెట్లో హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలని బాగా ఆలోచించిన తర్వాత దర్శకుడు హరి గతంలో సామి లో విక్రమ్ కు జోడీగా నటించిన త్రిష అయితేనే బాగుంటుందని సీక్వెల్ లో కూడా ఆమెనే ఖాయం చేశాడు.
నటి త్రిష కూడా ఈ క్రేజీ ఆఫర్ కు ఒప్పుకుని ఎక్కడి నుండి మొదలయ్యానో మళ్ళీ అక్కడికే వచ్చానంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసి ఈ వార్తను అధికారికంగా ఖరారు చేసింది. 2003లో విడుదలైన సామి మొదటి భాగం భారీ హిట్ గా నిలిచి విక్రం, త్రిష, దర్శకుడు హరిలకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది

,  ,  ,  ,  ,  ,