Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 11:25:16
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య కాలంలో కేవలం ట్రైలర్ తోనే ప్రభంజనం సృష్టించిన సినిమాలు చాలా తక్కువే ఉన్నాయి. అలాంటి వాటిలో అర్జున్ రెడ్డి సినిమా కూడా ఒకటి. అందుకే ఈ ట్రైలర్ రిలీజైనప్పటి నుండి హీరో దేవరకొండ విజయ్ సాయి కి తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయట. అందరూ తెగ పొగిడేస్తున్నారట.

ఈ సినిమాలో మనోడు సిగరెట్లకూ మందుకూ అలవాటుపడిన ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించాడు. ఇకపోతే ట్రైలర్లో వాడిన బూతు లాంగ్వేజ్ నే బోల్డ్ కంటెంట్ అనుకుంటే.. అదే జనాలకు తెగ నచ్చేసినట్లుంది. ఇక చివర్లో మనోడు జీవితంలో ఏం చేస్తాడో అంటే.. వెంటనే ఒక బీచ్ లో హీరోయిన్ షాలిని వడ్లమాని పెదాలను జుర్రేస్తూ కనిపిస్తాడు. గతంలో ఈ కిస్ గురించి వారు బాగా ప్రాక్టీస్ చేశారు అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీని గురించి కుర్రాడిని అడిగితే.. ''నిజ జీవితంలో లవ్వర్స్ అన్నాక ముద్దులు పెట్టుకోరు ఏంటండీ.. పైగా అందరూ లిప్ కిస్సులే పెట్టుకుంటారు. అందుకే మేం కూడా లాగించేశాం'' అంటూ కామెంట్ చేశాడు.

సర్లేండి.. సినిమాకు హైప్ తేవడానికి అలా లిప్ కిస్సులు పెట్టాం అంటూ ఎవరైనా చెప్తారా ఏంటి? నిజ జీవితంలో సన్నీ లియోన్ చేసిన ఆ పురాతన సినిమాలు కూడా అందరూ చేస్తూనే ఉంటారు.. అందుకని వాటిని వెండితెరమీద చూపించేస్తామా? కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి రూపొందించిన ''అర్జున్ రెడ్డి'' సినిమా.. త్వరలోనే విడుదలవ్వనుంది.

,  ,  ,  ,  ,