Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2015 16:06:02
facebook Twitter Googleplus
Photo

లాహిరి లాహిరి లాహిరిలో - సీతయ్య లాంటి సినిమాలతో తెలుగు పరిశ్రమను ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్న దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి. బడాస్టార్ లకు దూరంగా తీసిన ఈ సినిమాలు ఘన విజయాలు సాధించడంతో ఇండస్ట్రీలో తన పేరు మార్మోగిపోయింది. అయితే ఇక్కడ లైం లైట్ కన్నా డిమ్ లైట్ ఎఫెక్ట్ ఎక్కువగా వుంటుంది.

దేవదాసు విజయం తరువాత చౌదరి గారికి చెప్పుకోదగ్గ సినిమా లేదు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సలీమ్ - ఒక్క మగాడు సినిమాలు తీవ్ర నిరాశపరచడంతో పట్టించుకునే ఆయన్ని నాధుడే కరువయ్యాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని లాంచ్ చేస్తూ ఏళ్ళ తరబడి సినిమాను చెక్కుతూ తన సర్వస్వాన్ని పెట్టి తీసిన రేయ్ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చౌదరిగారు కోలుకోవడానికి చాలానే సమయం పడుతుందని భావించారు.

అయితే సినిమాపై వున్న పిచ్చి ఆయన్ని ఇంట్లో కుర్చొనివ్వట్లేదు. తాజాగా మరో ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం. దీనికిగానూ కృష్ణ ముకుందా మురారి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. తొలి సినిమా సీతారాముల కళ్యాణం తరువాత మరోసారి దేవుడ్ని నమ్ముకున్నారు. ఈ సినిమాతో అయినా ఆయనతో దోబూచులాడుతున్న విజయం తన దరికి చేరాలని ఆశిద్దాం..

,  ,  ,